TV9 Telugu
18 February 2024
సమంత ఆఫర్‌ను కొట్టేసిన దిశా.. పాపం.!
విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా తర్వాత సినిమాలకు గ్యాబ్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది.
అండ్ ఓ పాడ్ క్యాస్ట్ ఛానెల్‌ను మొదలెట్టి తన మాటలకు ఫీలింగ్స్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకోవాలని చూస్తోంది.
అన్నీ బాగుంటే మరి కొద్దీరోజుల్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తా అంటూ రీసెంట్‌గా ఓ ట్వీట్ కూడా చేసింది సామ్.
ఇంతలో తనకొచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను ఓ బాలీవుడ్ హీరోయిన్ ఎగిరేసుకుపోయింది అంట. ఇప్పుడదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఇక అసలు విషయం ఏంటంటే.. పుష్ప సినిమాలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా' పాట ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.
అయితే అదే మరో సారి రిపీట్ చేయాలనుకున్న సుక్కు.. అది కుదరకపోవడంతో బాలీవుడ్ బ్యూటీ దిశా చేతిలో పెట్టాడంట.
చాలా మంది హీరోయిన్లను అనుకున్ని చివరికి దిశను ఫిక్స్ చేశారట. కానీ ఈ లోగా సమంత మళ్లీ బ్యాక్ టూ సినిమాస్ అంటూ ట్వీట్ చేసింది.
అయితే అప్పటికే దిశను ఫిక్స్ చేసిన మేకర్స్.. తాజాగా ఆమెకే స్టిక్ అయి ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి