వావ్.. క్యాజువల్ లుక్ తోనే కుర్రకారుని మడతపెట్టేస్తున్న భూమిక..

Anil Kumar

23 June 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు ప్రేక్షకులకు, ఇటు సినీప్రియులకి పరిచయం అవసరంలేని సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా.

ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించింది భూమిక.

2000లో యువకుడు సినిమాతో తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత ఏడాది పవన్ నటించిన ఖుషీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా వెలిగింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది భూమిక..

కొన్నాళ్ళకి పెళ్లి.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రీఎంట్రీతో ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్.. తాజాగా నెట్టింట షేర్ చేసిన శారీలోని ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

చీరకట్టులో క్యాజువల్ లుక్ తో.. లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్స్ తెచ్చుకుంటూ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.