అందాలతో మతిపోగొడుతున్న చిన్నారి పెళ్లికూతురు ఇప్పుడు మరింత గ్లామర్ గా

Anil Kumar

25 August 2024

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై పాపులారిటీ తెచ్చుకొని హీరోయిన్ గా అడుగుపెట్టింది అవికా గోర్.

సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల తో హీరోయిన్‏గా మారింది.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ సినిమాలో అవికా నటనకు మంచి మార్కులు పడ్డాయి.. మొదటి సినిమాతోనే మెప్పించింది.

ఆ తరువాత కూడా అదే రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ సినిమా చేసింది.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్‏గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

కానీ ఈ అమ్మడి ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. తెలుగులోనే కాకుండా.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది ఈమె.

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమలు చేస్తుంది. ఈ మధ్య ప్రొడ్యూసర్ గా కూడా అడుగువేసింది అవికా.

ఇక అవికా సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.. ఈ మధ్య గ్లామర్ గేట్లు ఎత్తిసింది ఈ అమ్మడు.