స్టార్‌ హీరోకు స్వీటీ బిగ్ ఝలక్.! రూ.5 కోట్లు ఇస్తానన్నా నో.!

Anil Kumar

08 July 2024

ఆఫ్టర్ బాహుబలి.. చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క శెట్టి.. ఇప్పుడిప్పుడే అభిమానులకు దగ్గరవుతున్నారు.

ఆ మధ్య నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి  మెప్పించింది.

ఇందులో మరోసారి తన క్యూట్ లుక్స్ తో అభిమానులనే కాదు.. ప్రేక్షకులను సైతం కట్టిపడేసింది టాలీవుడ్ స్వీటీ.

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

ప్రస్తుతం అనుష్క క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ ఓ స్టార్ హీరో సినిమాలో చాన్స్‌ వస్తే నో అని చెప్పినట్టు తెలుస్తోంది.

ఆ సినిమా మేకర్స్ 5 కోట్లు రెమ్యునరేషన్‌ ఇస్తా అని చెప్పినప్పటికీ.. ఆ కథలో తనకు ఇంపార్టెన్స్ లేదంటూ..

ఆ ఆఫర్ ని అనుష్క లైట్ తీసుకుందని ఇండస్ట్రీలో టాక్. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా సినిమా అనేది మాత్రం తెలియలేదు.