TV9 Telugu
అనుష్క ఈసారి ప్రతీకారం తీర్చుకుంటారా.?
21 March 2024
అనుష్క శెట్టి ఒక సినిమాకు సైన్ చేశారంటేనే, కథ ఎంత వైవిధ్యంగా ఉందో.. అనే ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకు.
ఆ ఫీలింగ్‌కి బలం చేకూర్చే విధంగా తెరకెక్కుతోంది ఘాటి సినిమా. ఇంతకీ అదేం టైటిల్.? అని అనుకుంటున్నారా.?
వేదం తర్వాత క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న కొత్త సినిమాకు తెలుగులో ఘాటి అని పేరు పెట్టారు ఆయన.
ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తాజాగా అనౌన్స్ చేసారు.
నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాల్లో ఇంకా ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
ప్రతీకారం ప్రధానమైన అంశంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు క్రిష్.. ఇక అనుష్క నటన గురించి చెప్పాల్సిన పనే లేదు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో తన జీవితంలో మగవారికి చోటు వద్దనుకునే అమ్మాయిగా కనిపించారు హీరోయిన్ అనుష్క.
లేటెస్ట్ ఘాటిలో ప్రతీకారం తీర్చుకునే మహిళగా తనదైన నటనతో కచ్చితంగా మెప్పిస్తుంది అంటున్నారు ఆమె అభిమానులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి