TV9 Telugu

అసలు టిల్లు స్వేర్‌ ఆ పాత్ర చేయడంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అనుపమ.

03 April 2024

స్టార్ బాయ్ సిద్ధూ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్వేర్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల గలగలలు మోగిస్తోంది.

ఈ మువీలో అమ్మడు అనుపమ గ్లామర్‌ గేట్లు ఎత్తేసి మరి నటించడంతో అభిమానులు, ప్రేక్షకుల సైతం షాక్‌కు గురయ్యారు.

అనుపమను ఊహించి వంద శాతం కథ రాస్తే.. ఆమె యాక్టింగ్ తో వెయ్యి శాతం న్యాయం చేసిందని తాజ ఇంటర్వ్యూ లో సిద్ధూ అన్నారు.

ఇక ఈ సినిమాలో లిల్లీ పాత్ర, తన నటన గురించి అనుపమ కూడ చాల సార్లు స్పందించింది.. తాజగా మరోసారి చెప్పుకొచ్చింది.

'నా తొలి సినిమా ప్రేమమ్‌. అప్పుడు నాకు 19 ఏళ్లు. నా కెరీర్‌ మొదలై పదేళ్లవుతుంది. ఈమధ్య ప్రయోగాత్మక పాత్రలను ఎంపిక చేసుకుంటున్నా..

ఆ టైంలోనే టిల్లు స్టోరీ వచ్చింది.. అప్పుడే ఫిక్స్ అయ్యాను ఈ సినిమాలొ లిల్లీ పాత్ర చాలా ప్రత్యేకం, అసలు వొదులుకోవొద్దని..

లిల్లీ పాత్ర గ్లామర్‌తోపాటు పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉంటుంది. ఆ పాత్ర కోసం గ్లామర్‌గా కనిపించానే తప్ప..

హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం కానే కాదంటూ..' నవ్వుతూ చెప్పుకొచ్చిందీ కేరళ కుట్టీ. ఇక టిల్లు స్క్వేర్‌ మంచి సక్సెస్ ను అందుకుంది.