TV9 Telugu
04 January 2024
హీరోయిన్ అంజలి పాటిల్ కు 5 లక్షల కుచ్చుటోపి..!
కామన్ పీపులే కాదు, సెలబ్రిటీలు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో ఈజీగా చిక్కి లక్షల్లో మోసపోతున్నారు.
ఇక తాజాగా యాక్టరస్ అంజలి పాటిల్ ఇలాంటి కేటుగాళ్ల చేతుల్లోనే మోసపోయారు.
ఈ యాక్టర్స్‌కు రీసెంట్‌గా కొంతమంది సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టి దాదాపు 5 లక్షల వరకు గుంజారు.
ఓ వ్యక్తి తాను ఫెడ్ ఎక్స్ ఎంప్లాయంటూ అంజలికి ఫోన్ చేసి తన పేరిట ఉన్న పార్సిల్లో డ్రగ్స్ దొరికాయని అందులో తన ఆధార్ కార్ద్ కూడా ఉందని చెప్పాడట..
పోలీసులను అప్రోచ్ అవుతున్నానని బెదిరించాడట. ఆ వెంటనే ముంబయ్ సైబర్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నట్టు..
మరో వ్యక్తి ఫోన్ తన ఆధార్ కార్డ్‌కు మూడు బ్యాంక్ ఖాతాలు కనెక్ట్ అయి ఉన్నాయని అవి మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నాయని బెదరించాడట.
ఈ క్రమంలోనే ప్రాసెసింగ్ ఫీజ్ అంటూ అదంటూ ఇదంటూ దాదాపు 5 లక్షల వరకు ఈమె నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడట.
అయితే 5లక్షలు పోయాక కానీ అర్థం చేసుకోని ఈ హీరోయిన్ ఆ తరువాత చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు లబోదిబో అంటోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి