ఈ కోమలి క్యూట్‌నెస్‌కి అందం కూడా మురిసిపోతుంది.. అలియా ఆసమ్ లుక్స్..
26 September 2024
Battula Prudvi
15 మార్చి 1993న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో జన్మించింది బాలీవుడ్ అందాల తార అలియా భట్.
భట్ కుటుంబంలోని భారతీయ చలనచిత్ర దర్శకుడు మహేష్ భట్, బ్రిటిష్ నటి సోనీ రజ్దాన్ దంపతుల కుమార్తె ఈ ముద్దుగుమ్మ.
ఆమె తండ్రి గుజరాతీ సంతతికి చెందినవారు. తల్లి కాశ్మీరీ పండిట్ మరియు బ్రిటిష్ జర్మన్ వంశానికి చెందినవారు.
ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది. ఆమెకు ఒక అక్క షాహీన్. ఇంకా ఇద్దరు సిబ్లింగ్స్ పూజ, రాహుల్ భట్ ఉన్నారు.
నటుడు ఇమ్రాన్ హష్మీ, దర్శకుడు మోహిత్ సూరి ఈ వయ్యారి తండ్రి తరపు బంధువులు కాగా, నిర్మాత ముఖేష్ భట్ ఆమె మేనమామ.
జమ్నాబాయి నర్సీ స్కూల్లో చదువుకుంది కానీ నటనను కొనసాగించేందుకు పన్నెండవ తరగతితో చదువు మానేసింది ఈ బ్యూటీ.
2012లో టీనేజ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్‌లతో కలిసి మొదటి ప్రధాన పాత్రను పోషించింది.
తర్వాత చాల హిందీ సినిమాలు చేసింది. 2022లో ఆర్ఆర్ఆర్ చిత్రంతో తొలిసారి టాలీవుడ్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి