ఆచితూచి మాట్లాడే అలియా.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది.

Anil Kumar

09 June 2024

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ ఇక ఇప్పుడు కేవలం బాలీవుడ్‌ కి మాత్రమే పరిమితం కాదలచుకోవడం లేదట.!

తన కెరీర్‌ని అన్ని లాంగ్వేజెస్‌లోనూ విస్తరించాలని అనుకుంటున్నారు.. అదే ప్లాన్ తో అడుగులు వేస్తున్నరు.

టాప్‌ ఎండ్‌లో హాలీవుడ్‌ కనిపిస్తున్న.. రీజినల్‌ లాంగ్వేజెస్‌ మీద కూడా స్పెషల్‌ ఫోకస్‌ చేస్తున్నారు..

ఇప్పుడు ఆలియా మనసులో ఏముంది? ఇంతకు ముందులా కాకుండా ఈ బ్యూటీ ఇప్పుడెందుకు గట్టిగా వాయిస్‌ వినిపిస్తున్నారు.?

భిన్నమైన పాత్రలు  చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామనేది నా అభిప్రాయం అని అన్నారు హీరోయిన్‌ ఆలియా భట్‌.

భాషతో సంబంధం లేకుండా.. అన్ని భాషల సినిమాలు చూస్తానని.. అలా చాల భాషల్లో మూవీస్ చూశానని అన్నారు అలియా.

అయితే భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతానని.. ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తానని చెప్పారు.

తాను నటించిన హార్ట్ ఆఫ్‌ స్టోన్‌ సినిమా చేయడానికి కారణం కూడా అదేనని అన్నారు. ఇది 2023లో రిలీజ్ అయ్యింది.