దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన సినిమాలో సినిమాలో నిమిషం కనిపించినా చాలు అనుకుంటారు నటీ నటులు.
అయితే రాజమౌళి సినిమా ఛాన్స్ ఒక స్టార్ హీరోయిన్ కు ఇవ్వగా ఆ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిందట ఆ ముద్దగుమ్మ.
14ఏళ్ల కిందట రిలీజై దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్నా’ ఊహించని రేంజ్‌లో హిట్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.
అప్పటికే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘మగధీరా’ వంటి హిట్ సినిమాలు తీసి అనూహ్యంగా సునీల్ తో మర్యాద రామన్నా చేస్తున్నట్లు ప్రకటించి అందరకీ షాక్ ఇచ్చాడు.
ఇది ఇలా ఉంటే మర్యాద రామన్నా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మొట్టమొదట త్రిష దగ్గరకి వెళ్లిందట.. అయితే అప్పటికే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్.
సునీల్ అప్పటికీ కమెడియన్ మాత్రమే. అంతకు ముందు హీరోగా ఒక్క సినిమా మాత్రమే చేశాడు. అది కూడా పెద్దగా హిట్టవలేదు. దాంతో త్రిష ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది.
ఆ తర్వాత రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్‌లను కాకుండా కొత్త అమ్మాయిని తీసుకుందామని ఫిక్సయిపోయి సలోనినీ తీసుకున్నారు.