క్రికెట్ వరల్డ్ కప్ ను సినిమాల ప్రమోషన్‌కు వాడుకుంతున్న హీరోలు..

19 October 2023

వరల్డ్ వైడ్‌గా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుందిప్పుడు. ఇటు రాజకీయాలు.. అటు క్రికెట్ రెండూ పోటీ పడుతున్నాయి.

వీటి మధ్య సినిమాలు కూడా తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్‌ను ప్రమోషన్ కోసం వాడేస్తున్నారు మన హీరోలు.

మొన్న ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్‌లో కామెంటేటర్‌గా దర్శనమిచ్చారు మాస్ రాజా. అందులో టైగర్ నాగేశ్వరరావును ప్రమోట్ చేసుకున్నారు.

అక్టోబర్ 20న విడుదల కానుంది టైగర్ నాగేశ్వరరావు. ఇండో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రవితేజ కామెంట్రీ అదిరిపోయింది.

అలాగే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వచ్చారు.

రావడమే కాదు.. తన టైగర్ 3 ప్రమోషన్స్ భారీగా చేసుకున్నారు. స్టూడియోలో ఉండి.. సినిమా ముచ్చట్లతో పాటు టీమిండియాకు విషెస్ చెప్పారు కండల వీరుడు.

తాజాగా షారుక్ కూడా అదే చేయబోతున్నారు. రవితేజ, సల్మాన్ లీగ్ మ్యాచ్‌లపై ఫోకస్ చేస్తే.. కింగ్ ఖాన్ ఏకంగా ఫైనల్‌నే టార్గెట్ చేస్తున్నారు.

నవంబర్ 19న జరగబోయే ప్రపంచ కప్ ఫైనల్‌లో డంకీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియా ఫైనల్‌కు వస్తే.. షారుక్ సినిమా రేంజ్ మరింత పెరగనుంది.