ఈ పాన్ ఇండియా చిత్రాల్లో హీరోలు డ్యూయల్ రోల్స్ చేస్తున్నారంట..

10 September 2023

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరలో తారక్‌ డబుల్‌ రోల్‌లో కనిపిస్తారన్నది టాక్‌. అందులో యంగ్‌స్టర్‌గా, 60 ఏళ్ల వ్యక్తిగా డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారట ఎన్టీఆర్‌.

ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత తారక్‌ మాత్రమే కాదు, రామ్‌చరణ్‌ కూడా ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉన్నారు. మధ్యలో చేసిన ఆచార్య ఎలాగూ జనాలకు కనెక్ట్ కాలేదు.

అందుకే మెగా పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ అందరూ గేమ్‌ చేంజర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. శంకర్‌ డైరక్షన్‌లో చేస్తున్న గేమ్‌ చేంజర్‌లో డ్యూయల్‌ రోల్స్ చేస్తున్నారు చరణ్‌.

2024లో ఫ్యాన్స్ ని ఫెస్టివల్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు చెర్రీ .శంకర్‌ డైరక్షన్‌లో గేమ్‌ చేంజర్‌ హీరో మాత్రమే కాదు, ఇండియన్‌2 హీరో కూడా డ్యూయల్‌ రోల్స్ లో సందడి చేస్తారు.

ఇండియన్‌2 సినిమాకు సంబంధించి ఇప్పటికే క్యూరియాసిటీ క్రియేట్‌ అయింది. కమల్‌హాసన్‌ని ఏజ్డ్ గా, యంగ్‌స్టర్‌గా చూపిస్తున్నారు శంకర్‌.

భారతీయుడు వైబ్స్ ని రీ క్రియేట్‌ చేసే పనుల్లో ఉన్నారు శంకర్‌. రీసెంట్‌గా ఫారిన్‌లో వీఎఫ్ఎక్స్ స్టూడియోలో శంకర్‌ కనిపించినప్పుడు కూడా కమల్‌ యంగర్‌ వెర్షన్‌కి సంబంధించి డిస్కషన్‌ ఊపందుకుంది.

సలార్‌ షూటింగ్‌లో ఇద్దరు ప్రభాస్‌లున్నారు. ఒక ప్రభాస్‌ని రౌడీలు చుట్టుముడితే, ఇంకో ప్రభాస్‌ వచ్చి కాపాడుతున్నట్టు సీన్స్ తీశారని ఓ వ్యక్తి చెప్పినట్టు బెంగుళూరు మీడియాలో న్యూస్‌ వైరల్‌ అయింది.

సలార్‌ చాప్టర్‌ 1 లో ప్రభాస్‌ రెండు లుక్స్ లో కనిపిస్తారనే ప్రచారం దీంతో మరింత వైరల్‌ అవుతోంది. అదే నిజమైతే బాహుబలి తర్వాత ప్రభాస్‌ డబుల్‌ చేస్తున్న సినిమా సలార్‌ అవుతుంది.