నన్ను ఎవరాపుతారో చూస్తా.. విశాల్ స్ట్రాంగ్ రియాక్షన్.!
Anil Kumar
28 July 2024
హిట్స్ అండ్ ఫ్లాప్స్‌తో సంబంధం లేదు. కలెక్షన్ల లెక్కలు అసలే అవసరం లేదు. ఆ ఇమేజ్ ని క్రియేట్ చేసారు హీరో విశాల్.
మినిమం రేంజ్ హీరోగా కోలీవుడ్‌లో మాంచి ఫేమ్ సాధించాడు. ప్రొడ్యూసర్‌కు అండగా ఉంటాడు అన్న టాక్ కూడా ఉంది.
అలాంటి విశాల్ ను ఇప్పుడే అదే నిర్మాతలు టార్గెట్ చేశారు. టార్గెట్ అంటే మామూలుగా కాదు.. అంతకుమించి.
విశాల్ సినిమాకి పనిచేయాలంటే టెక్నీషియన్ దగ్గర్నుంచి ఆర్టిస్టుల వరకు ప్రతిఒక్కరూ పర్మిషన్ తీసుకోవాల్సిందే.
పర్మిషన్ తీసుకోకుంటే ఇండస్ట్రీ నుంచి అవుట్ అవుతారంటూ ఓ లెటర్‌ను నిర్మాతల మండలి రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా తన పై తమిళ నిర్మాతల మండలి ఆక్షంలు విధించడంపై.. తాజాగా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యాడు విశాల్.
తాను ఇప్పటి వరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా తగ్గేదేలే అంటూ చెప్పారు విశాల్.
తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా… దాడులకు దిగినా సినిమాలు తీస్తూనే ఉంటానన్నారు కాస్త ఘాటుగా రియాక్టయ్యారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి