స్టైలిష్ ఎవర్ గ్రీన్ హీరో విక్రమ్ చియాన్.. మైండ్ బ్లోయింగ్ లుక్

Anil Kumar

12 September 2024

స్టైలిష్ ఎవర్ గ్రీన్ హీరో విక్రమ్ చియాన్.. 1990లో ఎన్ కాదల్ కన్మణి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు పలు భాషలలో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విక్రమ్.

2003లో పితామగన్ చిత్రంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.

విక్రమ్ 12 ఏళ్ల అప్పుడు ఓ సినిమాలో మూగ అబ్బాయి పాత్ర చేసాడు. ఆ పాత్రకి ఐఐటీ మద్రాసులో ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది.

ఆ అవార్డు ప్రధానోత్సవం తర్వాత స్నేహితుడితో కలిసి తిరిగి వస్తున్నప్పుడు ఘోరమైన బైక్ ప్రమాదానికి గురయ్యాడు.

దీంతో ఆ ఘటనలో హీరో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. అందులో అతడి కుడి కాలును తీసేయ్యాలని సూచించారు వైద్యులు.

తన కాలు తీసేయ్యకుండా కాపాడేందుకు దాదాపు 23 సర్జరీలు చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విక్రమ్.

సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ తో ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్.