TV9 Telugu
27 february 2024
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటన.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో మూవీతో సూపర్ హిట్ సాధించారు.
ఆ తర్వాత సుహాస్ వరుస సినిమాలతో వస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నాడు. ఇటీవలే మరోసారి సాలిడ్ హిట్ కొట్టాడు.
కొద్ది రోజుల క్రితం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో థియేటర్లలో సందడి చేసి హిట్ అందుకున్నారు హీరో సుహాస్.
ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరి 2న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా సుహాస్ మూవీస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది.
రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ. 8కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది ఈ చిత్రం.
కొద్ది రోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక రూమర్స్ వచ్చాయి.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో సుహాస్‍తో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి