'లవ్‌స్టోరీ అంటే భయమేస్తోంది..' హీరో సిద్ధార్థ
హీరోగా సిద్ధార్థ్ కెరీర్ మొదలై ఇరవయ్యేళ్లవుతోంది
తొలినాళ్లలో లవర్‌బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా పాపులారిటీ దక్కించుకున్నాడు
‘టక్కర్’ మువీతో ఈసారి యాక్షన్ హీరోగా సందడి చేయనున్నారు
తాజాగా సిద్ధార్థ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రేమకథలు అంటే భయమేస్తుందని అన్నాడు
గులాబీ పువ్వు పట్టుకుని అమ్మాయితో, వాళ్ల నాన్నతో డైలాగులు చెప్పీచెప్పీ అలసిపోయా
‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మువీలతో పోలుస్తూ వాటిని మించిపోయేలా ప్రేమకథలతో నా దగ్గరికి వస్తుంటారు
ఇలా చివరికి ప్రేమకథల మారథాన్‌లా మారింది నా ప్రయాణం. ఒకటి హిట్ ఐతే మరో పదేళ్ల వరకూ అలాంటి ప్రేమకథలతోనే ఇబ్బంది పడాల్సి వస్తోంది
ప్రేమకథలు చేసే కుర్రాడు అలాంటివే చేయాలా? నాకేమో కొత్త రకమైన కథలతో మువీలు చేయాలని ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
ఇక్కడ క్లిక్ చేయండి