ఈ సినిమాపైనే అసలు పెట్టుకున్న టాలీవుడ్ హీరో, హీరోయిన్..
Anil Kumar
27May 2024
పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకుని హీరో శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మనమే’.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వస్తున్నా ఈ సినిమా కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో శర్వానంద్.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు..
శర్వానంద్ కెరీర్‌లో ఇది 35వ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు దర్శక నిర్మాతలు.. గతంలోనే టీజర్ రిలీజ్ చేసి అంచనాలను పెంచారు.
ఇక తాజాగా అప్డేట్ ప్రకారం జూన్ 7న "మనమే" సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది అని ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాలో ఉప్పెన మూవీలో బేబమ్మ గా ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చెయ్యనున్నారు.. ఇందులో చాలామంది ప్రముఖులు నటిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యనండి