18 November 2023

చూస్కో బ్రదర్‌ అంటున్న రవి తేజ ఫ్యాన్స్.!

2023ని పాజిటివ్‌గా స్టార్ట్ చేశారు మాస్‌ మహరాజ్‌. వాల్తేరు వీరయ్యలో తెలంగాణ యాసలో దుమ్ముదులిపారు రవితేజ.

వాల్తేరు వీరయ్య జబర్దస్త్ హిట్‌ అయినప్పటికీ, మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి సక్సెస్‌ని షేర్‌ చేసుకోవాల్సి వచ్చింది రవితేజకి.

అందుకే నెగటివ్‌ ఛాయలతో కనిపించిన రావణాసుర మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. 

ఆ వెంటనే చేసిన టైగర్‌ నాగేశ్వరరావు కూడా అనుకున్న ఫలితాలను అందించడంలో తడబడింది.

దీంతో, రవితేజ స్పీడ్‌ని మెచ్చుకుంటున్న వారే, కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ సలహాలిస్తున్నారు. 

2023లో రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావుతో ఏర్పడ్డ డ్యామేజ్‌ని కంట్రోల్‌  చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈగిల్‌ మీద పడింది.

2024  పొంగల్‌ రేసులో ఉన్న ఈగిల్‌, భారీ సినిమాల పోటీని తట్టుకుని నిలుచోవాలి. రవితేజ ఆశించే హిట్‌ని అందించాలి.

అందుకు తగ్గట్టే అన్నిటినీ ప్లాన్‌ చేసుకుంటున్నారు మేకర్స్.