22 September 2023

'హరి హర వీరమల్లు' కథ ఎవరి ఊహలకు అందదు : హీరో రవికృష్ణ

Pic credit - Instagram

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా .. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే 'హరి హర వీరమల్లు'

పీరియాడిక్ జోనర్లో.. ఏమ్‌ రత్నం పొడక్షన్స్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ఈ ఫిల్మ్ 

అయితే కరోనా ముందు నుంచి షూటింగ్ ఫేజ్లోనే ఉన్న ఈ సినిమా నుంచి పవన్‌ బర్త్‌ డే సందర్బంగా ఓ పోస్టర్ రిలీజ్ అయి.. అందర్నీ షేక్ చేసింది.

ఈ సినిమా వస్తుందా రాదా..? అని జనాల్లో ఉన్న అపోహలన్నింటినీ తొలిగిపోయేలా చేసింది. ఈసినిమాపై మళ్లీ జబ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ పై దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ ప్రొడ్యూసర్ కొడుకు రవికృష్ణ

తాజాగా 7/G బృందావన్‌ కాలనీ రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో ఉన్నఈ హీరో.. తాజాగా హరిహర మూవీ కథపై బిగ్ హింట్ ఇచ్చారు.

'హరి హర వీరమల్లు' కథ.. ఎవరి ఊహలకు అందదంటూ... ఈ సినిమా పై గురించి చెప్పి.. మరో సారి ఈ సినిమాను నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు. 

ఈ అప్డేట్‌తో పవన్ ఫ్యాన్స్‌ ను అరిపిస్తూనే.. పనిలో పనిగా.. తన 7/G బృందావన్‌ కాలినీ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు హీరో రవికృష్ణ