కార్తికేయ త్రీక్వెల్ ముచ్చట
TV9 Telugu
19 March 2024
ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ.
దానికి సీక్వెల్ అనే క్రేజ్‌తో రిలీజ్ అయి ప్యాన్ ఇండియా రేంజ్‌లో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది కార్తికేయ2.
ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ఈ మూవీ త్రీక్వెల్ మీద ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా ఉంటాయా చెప్పండి.
అందుకే చందూ మొండేటి, నిఖిల్ కాంబోలో వస్తున్న కార్తికేయ3 అనే మాట అలా వినిపించిందో లేదో, ఇలా వైరల్ అయింది.
నిఖిల్ హీరోగా నటించే ఇందులో అనుపమనే మళ్లీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేస్తారా లేక మరొకరిని తీసుకొంటారో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి జంట నటిస్తున్న తండేల్ మూవీ దర్శకత్వంలో బిజీగా ఉన్నారు చందు మొండేటి.
తండేల్ కంప్లీట్ కాగానే కార్తికేయ త్రీక్వెల్ మీద ఫోకస్ చేస్తారు చందు. ఒక్కసారి స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు కొలిక్కి రాగానే ప్రొడక్షన్ డీటైల్స్ అనౌన్స్ చేస్తారు మేకర్స్.
ప్రస్తుతం స్వయంభు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు హీరో నిఖిల్. దీని తర్వాత వరుస సినిమాలు చేయనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి