ఆ డైరెక్టర్ నిఖిల్‌  హేట్రిక్ మూవీ.. టైటిల్ అదే.. 

07 October 2024

Battula Prudvi 

హీరో నిఖిల్‌, దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. గతంలో వీళ్లిద్దరి కలయికలో ‘స్వామిరారా’, ‘కేశవ’ వచ్చాయి.

వీరి కాంబోలో ముందు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో హేట్రిక్ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమ కథతో ముడిపడి ఉన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.

ఇందులో నిఖిల్‎కి జోడిగా రుక్మిణీ వసంత్‌ కథానాయకిగా నటిస్తుంది. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్రలో కనిపించనుంది.

తాజాగా ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లో హీరో నిఖిల్, కథానాయకి రుక్మిణి ఓ నది తీరాన జంటగా నడిచొస్తూ కనిపించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడుక్షన్ పనులు చివరిలో ఉన్నందున దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం సమకూరుస్తుండగా.. నేపథ్య సంగీతం సన్నీ ఎం.ఆర్ అందిస్తున్నారని చిత్రం బృందం తెలిపింది.