మీ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నా.. నవదీప్ ఎమోషనల్
16 September 2023
డ్రగ్స్ కేసులో నిందితుడంటూ.. పరారీలో ఉన్నాడంటూ.. సీపీ ఆనంద్ మాటల వల్ల.. అంతటా హాట్ టాపిక్ గా మారిన నవదీప్.
ఆ తరువాత పోలీసులు బయటపెట్టిన పత్రాల్లో అబ్‌స్కాండ్ లిస్టులో నవదీప్ పేరు ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా A29 నిందితుడిగా.. నవదీప్ పేరును పోలీసులు కోట్ చేయడం కూడా వైరల్ అయింది.
దీంతో నవదీప్ హైకోర్టు మెట్లెక్కారు. తనను అరెస్ట్ చేయకుండా.. ఆదేశాలివ్వాలంటూ.. కోర్టుకు పిటిషన్ ఇచ్చారు.
ఇక కోర్టు పిటిషన్‌లోనే.. పోలీసుల తప్పుడు ప్రకటనతో మానసిక ఒత్తిడికి గురయ్యా అంటూ.. పేర్కొన్నారు నవదీప్.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తన పేరును పోలీసులు ప్రస్తావించడంపై టాలీవుడ్ హీరో నవదీప్ అభ్యంతం వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. డ్రగ్స్ తీసుకున్నానని అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు ఆయన.
విచారణ జరపకుండా.. తాను పరారీలో ఉన్నట్టు ఎలా ప్రకటిస్తారని.. పోలీసుల తీరును గురించి తన పిటీషన్లో పేర్కొన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి