TV9 Telugu
ఇంటర్నేషనల్ లెవల్లో నాని హాయ్ నాన్నకు అవార్డుల పంట.!
09 April 2024
శౌర్యు డైరెక్షన్ లో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
గతేడాది డిసెంబర్ 7న ఫీల్ గుడ్ మూవీగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుండే మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలీవుడ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన హాయ్ నాన్న సినిమాలో హీరో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇక్కడ సాలిడ్ హిట్ కొట్టిన ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం హాయ్ డాడీ పేరుతో విడుదల చేసారు మేకర్స్.
ఈ క్రమంలోనే తాజాగా ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్ అవార్డును కైవసం చేసుకుంది హాయ్ నాన్న.
మార్చి 2024 ఎడిషన్‌లో హాయ్ డాడీ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచి., ఏకంగా 11 విభాగాల్లో అవార్డులను సాధించింది.
హాయ్ నాన్న సినిమాకు ఇన్ని అవార్డులు రావడంతో దర్శకుడు శౌర్య, హీరో నాని & మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి