ఈ దశాబ్దంలో నాకు బాగా ఇష్టమైన సినిమా ఇదే: నాని

TV9 Telugu

17 July 2024

శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న..  ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ హీరో, న్యాచురల్ స్టార్ నాని. 

ప్రస్తుతం' సరిపోదా శనివారం' మరో డిఫరెంట్ మూవీతో ఆడియెన్స్ ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడీ హీరో. 

 పాన్‌ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు  వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్ హీరోయిన్.

అలాగే కోలీవుడ్ నటుడు ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 29న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే సినిమా షూటింగులతో బిజిబిజీగా ఉండే హీరో నాని తాజాగా డార్లింగ్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డార్లింగ్ మూవీ హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించాడు నాని. ఈ దశాబ్దంలోనే తనకిష్టమైన సినిమా బలగం అని నాని తెలిపాడు.

బలగం హీరో ఫ్యాన్‌గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని, డార్లింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని నాని ఆకాంక్షించారు.

హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్‌ జంటగా నటించిన డార్లింగ్ సినిమా ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది.