08 December 2023

ఎమోషనల్లీ ఆకట్టుకుంటున్న నాన్న.. నాని మళ్లీ హిట్టుకొట్టినట్టే.!

క్లాసు మాసు అని తేడా లేకుండా.. సినిమాలు చేసుకుందటూ పోతున్న నాని..

తాజాగా క్లాసికల్ టచ్‌ ఉన్న హాయ్‌ నాన్న సినిమాతో మన ముందుకు వచ్చారు. 

డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమాతో అందర్నీ ఎమోషనల్గా టచ్‌ చేస్తా అంటూ.. 

కొన్ని రోజుల ముందు నుంచే చెబుతూ వస్తున్నాడు. అనుకున్నది చేసేశాడు కూడా..

ఇక  సినిమా మొదలవ్వగానే 15 నిమిషాలు ఒకరకమైన ట్రాన్స్‌లోనే ఉండిపోతారు ప్రేక్షకులు. 

కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ భారంగా మారుతూ.. అసలేం ఉందని నాని ఈ సినిమా చేశాడని అనిపిస్తుంది. 

కానీ ఇంటర్వెల్ కార్డ్ పడినప్పటి నుంచి ఒపీనియన్ మారిపోతుంది. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే సెకండాఫ్ రైటింగ్ అద్భుతంగా ఉంది.