కిరణ్‌ అబ్బవరం పెళ్లి కుదిరింది!

TV9 Telugu

12 March 2024

రాజావారు రాణీగారు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కిరణ్‌ అబ్బవరం.

తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత అంతగా ఆకట్టుకొనే ఏమి సినిమాలు రాలేదు.

ప్రస్తుతం దిల్‌రూబా అని ఓ సినిమా చేస్తున్నారు. 1970ల నేపథ్యంలో ఓ పీరియాడిక్‌ డ్రామా కూడా చేస్తున్నారు.

ఈ సినిమాల సంగతి అలా ఉంటే, త్వరలోనే వ్యక్తిగతంగానూ మరో అడుగు ముందుకు వేయబోతున్నారు హీరో కిరణ్‌ అబ్బవరం.

టాలీవుడ్ లో హీరోయిన్‌గా నటిస్తున్న రహస్యతో ఆయన పెళ్లి కుదిరింది. ఈ వారమే నిశ్చితార్థం కూడా జరగనుందని తెలిపారు.

ఇరువురు కుటుంబాల పెద్దల అంగీకారం తెలపడంతో ఈ టాలీవుడ్ ప్రేమ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

రాజావారు రాణీగారు సినిమాలో చేస్తున్నప్పుడే హీరో కిరణ్ సబ్బవరం, హీరోయిన్ రహస్యాల మధ్య ప్రేమ మొదలైంది.

అప్పటి నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ టాలీవుడ్ ప్రేమ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.