TV9 Telugu
ప్రభాస్ కల్కి సినిమాపై షాక్ ఇచ్చిన కమల్ హాసన్.
26 March 2024
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కల్కి 2898 AD.
భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మోస్ట్ ఎక్సైటెడ్ గా వస్తున్నా కల్కి సినిమా విషయంలో అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు తమిళ్ హీరో కమల్ హాసన్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన తదుపరి మూడు సినిమాలపై అప్డేట్స్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో కల్కి కూడా ఒకటి.
కల్కి సినిమాలో తాను కేవలం అతిథి పాత్రలో కనిపించనున్నానని తన రోల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని అన్నారు.
దీంతో ఈ మూవీలో కమల్ పాత్ర పెద్దగా స్కోప్ లేదని అర్ధం అయ్యిందంటూ ఆయన అభిమానులు, ప్రేక్షకులు నిరాశ చెందారు.
అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కమల్ పాత్రను గెస్ట్ రోల్ అయినా అతడి పాత్ర ఇంపాక్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి