11 November 2023
సినిమాలకు గుడ్ బై చెప్తారు అనుకున్నరు కానీ ఇప్పుడు ఫుల్ జోష్ తో బిజీగా కమల్.
ఒక్క ఒక్క హిట్ కమల్ జర్నీనే మార్చేసింది. యంగ్ హీరోలు కూడా చూపించిన రేంజ్‌లో స్పీడు చూపిస్తున్నారు లోకనాయకుడు.
తన ఏజ్‌కు తగ్గ రోల్‌లో కనిపిస్తూనే మాస్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేసిన లోకనాయకుడు సిల్వర్ స్క్రీన్ మీద నయా ఇన్నింగ్స్ షురూ చేశారు.
ఆల్రెడీ భారతీయుడు 2 షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
విక్రమ్ సక్సెస్ తరువాత మూవీ సెలక్షన్ స్పీడు పెంచిన కమల్ నెగెటివ్ రోల్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమాతో విలన్‌గా నటిస్తున్నారు.
36 ఏళ్ల తరువాత మణిరత్నం కాంబినేషన్‌లో మూవీ చేస్తున్నారు కమల్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా టైమున్నా..
వీటితో పాటు లాంగ్ డిలేయిడ్ శభాష్ నాయుడు సినిమాను కూడా పట్టాలెక్కించాలన్నది కమల్ ఆలోచన.
మరో వైపు లోకేష్ కనగరాజ్ కాంబోలో విక్రమ్ 2ను కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు కమల్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి