కొన్నిటిని దాచేయాలి! గోపీచంద్..
TV9 Telugu
08 March 2024
కొన్నిటిని దాచేయాలి అని అంటున్నారు హీరో గోపీచంద్. ఉన్నట్టుండి దాచేయాల్సినంత అవసరం ఏం వచ్చింది? అని అడిగితే సరదాగా నవ్వేస్తున్నారు.
దీని గురించి అడిగితే నేను చెబుతున్నది నా ప్రైవేట్ లైఫ్ గురించి అని అంటున్నారు టాలీవుడ్ మాచో స్టార్.
సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ సమయంలోనూ పెద్దగా సోషల్ మీడియాలో ఉండరు గోపీచంద్.
అంతే కాదు, ఇండస్ట్రీలో జరిగే ప్రైవేట్ పార్టీలకు, ఆఫ్టర్ సక్సెస్ పార్టీలకు కూడా పెద్దగా హాజరు కారు ఆయన.
ఎందుకలా దూరం దూరంగా ఉంటారు అని అడిగితే, నేనెప్పటి నుంచో అంతేనండీ.. నాకోసం కొంచెం దాచుకుంటాను అంటారు సరదాగా.
ఆయన నటించిన సినిమా భీమా. అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రితం గోలీమార్ కోసం ఖాకీ చొక్కా వేసుకున్నారు గోపీచంద్.
అందులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భీమాలో ఖాకీ చొక్కాలో కనిపించడం ఆనందంగా ఉందని అన్నారు.
అంతేకాదు, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జుట్టు, గడ్డం పెంచినట్టు తెలిపారు గోపీచంద్. ఈ చిత్రం మార్చ్ 8న విడుదలైంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి