దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు సినిమాలకి సరికొత్త మార్కెట్‌..

Anil Kumar

11 July 2024

వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న దుల్కర్ సల్మాన్ - మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్.

సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటికే నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 27న ఈ మూవీను విడుదల చేయాలనుకున్నా..

అదే రోజు పాన్ ఇండియా ఎన్టీఆర్ దేవర వస్తుండటంతో.. రెండు వారాలు ముందే రావాలని చూస్తున్నారు ఈ మూవీ మేకర్స్.

ఇదే జరిగితే గనక వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 7 న ఈ మూవీ విడుదలవుతుంది దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.

ఒక మిడిల్‌ క్లాస్‌ మేన్‌.. అసాధారణమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనేలా ఇంట్రస్టింగ్‌గా ఉంది లక్కీ భాస్కర్‌.

దుల్కర్‌ సల్మాన్‌ స్ట్రెయిట్‌గా తెలుగులో సినిమా చేసిన ప్రతిసారీ సరికొత్త మార్కెట్‌ని క్రియేట్‌ చేస్తున్నారు.

ఇప్పుడు బ్యాంక్‌ క్యాషియర్‌గా ఆయన ఏం చేయబోతున్నారన్నది సస్పెన్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.

మహానటి, సీతారామమ్‌ లో దుల్కర్ నటనకు ఫిదా అయ్యారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు లక్కీ భాస్కర్‌ లో సరికొత్తగా చూపిస్తోంది.