కుర్ర హీరోస్ కి పోటీ ఇచ్చేలా అర్జున్ స్టైలిష్ ఫొటోస్..

Anil Kumar

31 August 2024

యాక్షన్ హీరో అర్జున్ సర్జా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అర్జున్.

హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అర్జున్.. సహాయ నటుడిగానే కాక విలన్ గా కూడా నటించి మెప్పించారు.

అర్జున్ సినిమా కెరీర్ లోకి వచ్చి 43 ఏళ్ల  అవుతోంది. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు అర్జున్.

అర్జున్ కేవలం హీరోనే కాదు.. విలన్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యాక్షన్ మాన్.

ఒక్క బాషలోనే కాదు కన్నడ, తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ బ్రహ్మాస్త్ర మూవీతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు.

యాక్షన్ కింగ్ అర్జున్ అని అభిమానులతో పిలుచుకునే ఆయన ఇప్పటికి 150కి పైగా మూవీస్ నటించి అందరికి దగ్గరైయ్యారు.

తాజాగా అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోస్ చూసి ఆయన అభిమానులు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

స్టైలిష్ లుక్ తో సరికొత్త మేకోవర్ లో.. కుర్ర హీరోస్ కి పోటీ ఇచేలా అర్జున్ ఫొటోస్ ఉన్నాయి అంటున్నారు.