కల్కి సెకండ్‌ పార్టు పై స్పందించిన బిగ్‌ బీ అమితాబ్‌.! కామెంట్స్ వైరల్

Anil Kumar

06 July 2024

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.

మన డార్లింగ్ కాస్త ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వార్‏కి దిగితే ఇదిలా అలాగే ఉంటుంది మరి.

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో కల్కి ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేమే లేదు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ పై స్పందించిన బాలీవుడ్ బిగ్ బీ కల్కి సెకండ్ పార్ట్ పై కూడా చిన్న హింట్ ఇచ్చారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్కి సినిమాలను తెరకెక్కించడం పెద్ద సాహసమని అన్నారు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌.

డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ కల్కి సినిమా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు అమితాబ్‌ బచ్చన్‌.

ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగిన విషయాలను తెర మీద చూపించిన కెప్టెన్ తీరు అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు.

ఇక కల్కి సెకండ్‌ పార్టు కూడా అందరి అంచనాలకు మించి ఉంటుందని.. ఊహించలేరని చాల ధీమా వ్యక్తం చేసారు బిగ్‌ బీ.