సినిమాలు నిల్లు.. సొగసులు ఫుల్లు.. అందాలతో గాలాలు వేస్తున్న వయ్యారి

Rajeev 

02 July 2024

హెబ్బా పటేల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఒకే ఒక్క సినిమాతో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ సినిమానే కుమారి 21 ఎఫ్. 

సుకుమార్ రైటింగ్స్ పై సూర్య కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో హెబ్బా తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది.

కానీ అంతగా సక్సెస్ సాధిచలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గాను చేసింది ఈ అమ్మడు.

అయినా అదృష్టం కలిసి రాలేదు. దాంతో కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది హెబ్బా పటేల్.

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది.