అందం ఈమెను దేవతగా తలచి వరం అడుగుతుందేమో..

TV9 Telugu

08 April 2024

6 జనవరి 1989న మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ కన్నడ మాట్లాడే ముస్లిం కుటుంబంలో జన్మించింది హెబ్బా పటేల్.

మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

2014లో వచ్చిన కన్నడ రోమాంటిక్ కామెడీ చిత్రం అద్యక్ష సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

అదే ఏడాది తిరుమానం ఎనుమ్ నిక్కా అనే ఓ తమిళ రొమాంటిక్ సినిమాలో కథానాయకిగా తొలిసారి కోలీవుడ్ లో నటించింది.

తర్వాత రాహుల్ రావేంద్రన్ హీరోగా నటించిన అలా ఎలా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2015లో రాజ్ తరుణ్ కి జోడిగా టాలీవుడ్ రొమాంటిక్ డ్రామా కుమారి 21Fతోతెలుగులో గుర్తింపు తెచ్చికుంది ఈ బ్యూటీ.

తర్వాత తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా, భీష్మ, ఒరేయ్ బుజ్జిగా, ఓదెల రైల్వే స్టేషన్ వంటి హిట్ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం తెలుగులో ఓదెల 2లో నటిస్తుంది. వల్లన్, ఆద్య అనే రెండు తమిళ చిత్రాల్లో కనిపించనుంది ఈ అందాల భామ.