30 October 2023
రాజకీయ వేడి పెంచుతున్న పొలిటికల్ మూవీస్.
ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా పొలిటికల్ హీట్ గట్టిగా కనిపిస్తోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం, మహి వీ రాఘవ యాత్ర 2 సినిమాల విషయంలో..
అయితే ఈ సినిమా కాస్టింగ్ విషయంలో రెండు సినిమాల మేకర్స్ రెండు డిపరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు.
తాజాగా యాత్ర 2 సినిమాలో చంద్రబాబు పాత్రకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ బాబు పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించారు.
మహేష్ మంజ్రేకర్‌ను చంద్రబాబు రోల్‌కు సెలెక్ట్ చేయటంపై ఆసక్తికరంగా మారింది.
యాత్ర విషయంలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు మహి. ఆ సినిమాలో మెయిన్ రోల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అయినా..
లుక్స్ పరంగా ఆయనకు ఏ మాత్రం సిమిలారిటీ లేని మమ్ముట్టిని ఆ రోల్‌కు తీసుకున్నారు.
ఈ ఫార్ములా సూపర్ సక్సెస్ కావటంతో ఇప్పుడు యాత్ర 2 విషయంలోనూ అదే స్టైల్‌ను ఫాలో అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి