స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

February  29, 2024

TV9 Telugu

స్టార్ సింగర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఈ రోజు కేసు నమోదు అయ్యింది

దేశాన్ని అవమానించేలా, అగౌరవంగా అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన ఓ విద్యార్థి కుమార్‌ సాగర్‌ ఫిర్యాదు చేశారు 

ఇటీవల సీనియర్‌ నటి అన్మపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా..

ఎందుకు స్వాతంత్య్రం కావాలి ఆడవాళ్లకు? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

ఇప్పుడు ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా.. అందరూ ఏదో ఒకటి అనేట్లుగానే డ్రెస్సింగ్‌ చేసుకుంటున్నారు

ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది అన్న అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలపై చిన్మయి సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అయింది

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఆడవాల్లు బయటి పనులు ముగించుకోవాలి. సాయంత్రం 6 తర్వాత డెలివరీస్‌, యాక్సిడెంట్స్‌, ఎమర్జెన్సీ అవసరాలు ఏమీ రాకూడదా.. పగలు మాత్రమే ఇవన్నీ జరగాలి

మనదేశంలో పుట్టడం నా కర్మ, ఇదో స్టుపిడ్‌ కంట్రీ అంటూ పలు వీడియోలు చిన్మయి నెట్టింట విడుదల చేశారు. దీంతో బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌సీయూ విద్యార్ధి కోరారు