మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చిందా.? అసలు మ్యాటర్ ఇదేనా..

29 January 2025

Rajeev 

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. తెలుగులో ఈ అమ్మడు సినిమా చేసి చాలా రోజులు అయ్యింది.

తెలుగులో ఒకప్పుడు తమన్నా టాప్ హీరోయిన్ గా రాణించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, భారీ హిట్స్ తో దూసుకుపోయింది.

అదే సమయంలో తమిళ్ ఇండస్ట్రీ పై కూడా ఫోకస్ చేసింది. అలా తెలుగు, తమిళ్ లో రాణించిన ఈ చిన్నదానికి ఇప్పుడు ఆఫర్స్ తగ్గిపోయాయి.

తెలుగులో ఈ మధ్య కాలంలో తమన్నా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. కానీ హిందీలో మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తుంది.

రీసెంట్ డేస్ లో తమన్నా స్పెషల్ సాంగ్స్ తోనూ అదరగొడుతుంది. తెలుగులో ఈ చిన్నది ఇప్పుడు ఓదెల 2లో నటిస్తుంది.

సోషల్ మీడియాలో తమన్నా ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును కవ్విస్తుంది ఈ చిన్నది.