టాలీవుడ్‌కు ఆల్మోస్ట్ దూరమైపోయిన రకుల్.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

17 September 2025

Rajeev  

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. 

తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది. 

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇటీవలే మేరీ హస్బెండ్ కి బీవీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తోన్న దేదే ప్యార్ దే 2 చిత్రంలో నటిస్తుంది. 

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.

కానీ తెలుగులో సినిమాలు తగ్గించింది ఈ వయ్యారి భామ. లుగులో రకుల్ నటించిన లాస్ట్ ఎనిమిది సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. దాంతో ఈ చిన్నది సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.