TV9 Telugu
హరిహర వీరమల్లు... రెండుపార్టులే!
28 Febraury 2024
పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా హరిహరవీరమల్లు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయక. ఈ సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియా పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే, వాటన్నిటికీ సమాధానం చెప్పేలా తరచూ మూవీ అప్‌డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని ఆ మధ్య రివీల్ చేశారు.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని హరిహరవీరమల్లు సినిమా నిర్మాత ఎ.ఎం.రత్నం స్వయంగా వెల్లడించారు. దీంతో ఆ రూమర్ కు చెక్ పడింది.
పవన్‌కల్యాణ్‌తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే జస్ట్... ఆయన దగ్గర 20 డేస్ కాల్షీట్ తీసుకుని, ఏదో ఒకటి చుట్టేయొచ్చని అన్నారు.
పవర్‌స్టార్‌తో గుర్తుండిపోయే సినిమా చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు రత్నం. అందుకే హరిహరవీరమల్లును తెరకెక్కిస్తున్నానని అన్నారు.
మన దేశంతో పాటు ఇరాన్, కెనడాలోనూ హరిహరవీరమల్లు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందని చెప్పారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి