హాలీవుడ్‌కు హనుమాన్‌

TV9 Telugu

05 March 2024

92 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ చరిత్ర తిరగరాసింది. 

30 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి.. 300 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మేకర్స్.

అంతా బాగానే ఉంది కానీ.. హనుమాన్‌ను ఇండియాతో పాటు జపాన్, చైనా, స్పెయిన్ లాంటి దేశాల్లోనూ విడుదల చేస్తామని చెప్పారు ప్రశాంత్ వర్మ. 

కానీ కొన్నాళ్లుగా ఆ ఊసే లేదు. తాజాగా 50 రోజుల వేడుకలో ఇంటర్నేషనల్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్. 

ఇప్పటికే ఫారెన్ డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడామని.. వాళ్లకు బాగా నచ్చిందని తెలిపారు డైరెక్టర్  ప్రశాంత్ వర్మ.

హనుమాన్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తామని ఇక జై హనుమాన్ వర్క్ మొదలైందని.. ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారీయన. 

హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు ఈ దర్శకుడు.  అయితే ఇందులో రానా దగ్గుబాటి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారని వార్త వైరల్ అవుతుంది.