తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తెలుగు సూపర్ హీరో చిత్రం హనుమాన్. ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది.
తేజ సజ్జ ఆమృత అయ్యర్ జంటగా నటించిన హనుమాన్ సినిమాను దేశ, విదేశాల్లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తామని చెప్పారు ప్రశాంత్.
అయితే ఈ సినిమాకు గానూ మొదటి అవార్డును అందుకున్నారు వర్మ. రేడియో సిటీ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు ప్రశాంత్ వర్మ.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆదిపర్వం'. మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మి.
తాజాగా ఈమె నటిస్తున్న ఆదిపర్వం ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్‌లో జరిగింది.
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే. తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్ ఇందులో కథనాయికగా నటిస్తున్నారు.
గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా శశివదనే వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.