15 January 2024

మాట నిలబెట్టుకున్న హనుమాన్‌ టీం

TV9 Telugu

తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ జనవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది

50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్‌ డే వన్‌.. ఆలోవర్‌ వరల్డ్‌ దాదాపు 21.35 కోట్లను వసూలు చేసిందట.

ఇక హనుమాన్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సమయంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.

తమ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా అందిస్తామని ప్రకటించింది.

ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు.

చెప్పినట్టుగానే హనుమాన్‌ మూవీ కలెక్షన్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చింది.

వచ్చిన ఆదాయంలో 14.25 లక్షలను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌’కు విరాళంగా పంపించారు మేకర్స్‌.