హనుమాన్ వసూళ్ల సునామీ.. నా సామిరంగ బ్రేక్ ఈవెన్..

TV9 Telugu

23 January 2024

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తెలుగు బ్లాక్ బస్టర్ సూపర్ హీరో సినిమా హనుమాన్.

తేజ సజ్జకి జోడిగా అమృత అయ్యర్ కథానాయకిగా చేసింది. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది ఇది.

ఈ సినిమా 10 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ అందుకుంది. దాంతో పాటు విడుదలైన 10వ రోజు ఏపీ, తెలంగాణలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది.

ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. షేర్ 108 కోట్లు ఉంది. 300 కోట్లుపైనే గ్రాస్ రానున్నట్లు అంచనా.

అక్కినేని నాగార్జున హీరోగా కొరియోగ్రాఫేర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా తెరకెక్కించిన పండగ లాంటి సినిమా నా సామిరంగ.

సంక్రాంతి పండగ కానుకగా ఈ ఏడాది జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా నా సామిరంగ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందని తెలిపారు చిత్ర దర్శక నిర్మాతలు.

సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో హనుమాన్ తర్వాత, బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా నా సామిరంగ నిలిచింది.