12-02-2024

హనుమాన్ ఎఫెక్ట్.. రెమ్యూనరేషన్ కోట్లలో పెంచేసిన హీరో

TV9 Telugu

యంగ్ హీరోలు తాము నటించే ప్రతి సినిమాను పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డ్ సెట్ చేశాడు.

తేజ నటించిన నటించిన ‘హనుమాన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది.

రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకుంది. దీంతో ఈ హీరో తన రెమ్యూనరేషన్ పెంచారనే టాక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.

‘హనుమాన్’ సినిమా కోసం తేజ సజ్జ కోటి రూపాయలలోపే పారితోషికం తీసుకున్నాడట. 

అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దాంతో ఈ కుర్ర హీరో రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తుంది.

ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ.