TV9 Telugu
ఘనంగా హనుమాన్ 50 రోజుల పండగ..
04 March 2024
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు సూపర్ హీరో సినిమా హనుమాన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది.
సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైన స్టార్ హీరోలని వెనక్కి నెట్టి 300 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం.
ఈ చిత్రంలో దర్శకుడు ప్రశాంత్ చూపించిన విజువల్స్ కి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. మరో రాజమౌళి అంటూ ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకుంది. దింతో హనుమాన్ 50 రోజుల పండగ నిర్వహించారు దర్శక నిర్మాతలు.
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు హనుమాన్ దర్శకుడు, హీరో హీరోయిన్లు సహా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
మరోవైపు మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా హనుమాన్‌ను ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ రానున్నట్టు ఇదివరకే ప్రకటించారు మూవీ మేకర్స్. ఇది 2025 సంక్రాంతికి విడుదల కానుంది.
త్వరలోనే జై హనుమాన్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామన్నారు ప్రశాంత్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి