24 January 2024

విధ్వంసకరంగా హనుమాన్ కలెక్షన్స్

TV9 Telugu

చిన్న సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనుకున్నారు. కానీ కంటెంట్‌ మీద బలంగా ఉన్న ఈ సినిమా వాళ్లు.. ససేమిరా అన్నారు. 

ఎస్ ! ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. 

పెద్ద సినిమాల మధ్య రిలీజ్‌ అయిన ఈ చిన్న సినిమా... సూపర్ డూపర్ హిట్టైపోయింది.

ఆల్ ఓవర్ వరల్డ్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది.

ఇక ఇప్పుడేమో.. ఏకంగా 200 కోట్ల క్లబ్‌లోకి లెగ్గుకూడా ఎట్టేసింది.  ఇండియన్ ఫిల్మ్ ఫెటెర్నిటీలో సెన్సేషన్ అవుతోంది.

ఇక ఈ కలెక్షన్స్‌ గురించి మేకర్స్‌ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

ఆ శ్రీరాముడి ఆశీర్వాధంతో... 200 కోట్లు మార్క్‌కు రీచ్‌ అయ్యాం అనేట్టు ఓ ట్వీట్ చేశారు మేకర్స్‌.