TV9 Telugu
హనుమాన్ మూవీనే అనుకుంటే అంతకుమించి కాన్సెప్ట్ తో రానున్న తేజ సజ్జా.
17 April 2024
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా అయినా సంగతి తెలిసిందే.!
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని శబాష్ అనిపించుకుంది.
దీంతో తేజ పాన్ ఇండియా హీరో అయిపోయారు అనే చెప్పాలి. ఇక ఈ కుర్ర నెక్స్ట్ సినిమాపై అందరు ఆసక్తి చూపుతున్నారు.
హనుమాన్ సక్సెస్ తరువాత తేజ సజ్జా తాను నెక్స్ట్ చెయ్యబోయే సినిమాపై మరింత ఫోకస్ చేసారని టాక్. అందులో భాగంగానే..
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా.. ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది..
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే గురువారం ఈ మూవీ టైటిల్‌ని ప్రకటించనున్నారు మేకర్స్.
ఈ సినిమా లో యోధగా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు హీరో తేజ సజ్జా. ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ కూడా పెంచారు.
హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలిపారు ఈ మూవీ మేకర్స్. దీనిపై క్లారిటీ రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి