11 July 2025

16 ఏళ్లకే తోపు హీరోయిన్.. అందుకు హార్మోన్ ఇంజక్షన్ తీసుకుందంటూ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో హీరోయిన్లుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే సవాళ్లను ఎదుర్కొవాలి. వచ్చిన స్టార్ స్టేటస్ సైతం కష్టంగానే కాపాడుకోవాలి. 

16 ఏళ్లకే తోపు హీరోయిన్ అయ్యింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. 

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..? 

తనే హీరోయిన్ హాన్సిక. అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో కథానాయికగా వెడితెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. 

ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో మూవీస్ చేసింది.

అయితే చిన్న వయసులోనే కథానాయికగా సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. అందం కోసం హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ విమర్శలు వచ్చాయి. 

ఈ విషయంపై చాలా సార్లు వివరణ ఇచ్చింది. అనేక ఇంటర్వ్యూలలో తన గురించి వచ్చిన రూమర్స్ కారణంగా ఎంతో బాధపడినట్లు తెలిపింది ఈ అమ్మడు. 

తనపై వచ్చిన రూమర్స్ చూసి తన తల్లి ఎంతో బాధపడిందని.. తన తల్లి పరిస్థితి చూసి తాను సైతం బాధపడినట్లు.. ఆ రూమర్స్ చూసి గుండె బద్దలైందని  తెలిపింది.