మోడ్రన్ డ్రెస్ లో హన్సిక హాట్ ఫోజులు

Phani CH

30 SEP 2024

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు హవా నడిపించింది స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ. ఈమె  గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన  దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. 

హీరోయిన్ గా తన కెరీర్ ను టాలీవుడ్ చిత్రాలతోనే మొదలుపెట్టిందన్న విషయం తెలిసిందే.  ఆ తర్వాతే ఇతర భాషల్లోనూ తనదైన శైలి నటనతో దుమ్ములేపింది.

కెరీర్ స్టార్టింగ్ లో  హన్సికా  చైల్డ్ ఆర్టిస్ట్ ప్రారంభించింది.  హవా, కోయి మిల్ గయా వంటి బాలీవుడ్ చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. తరువాత  దేశముదురు సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.

తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇది ఇలా ఉంటె గత సంవత్సరం డిసెంబర్ 4న జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ ప్యాలస్ లో  తన స్నేహితుడు సోహైల్ ఖతురియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది హన్సిక. 

ఆచార సంప్రాదాయాలతో పాటించి ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.