పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోని హన్సిక.. కారణమేంటంటే?
తమిళ స్టార్ హీరోయిన్, యాపిల్ బ్యూటీ హన్సిక గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. తన ప్రియుడు సొహైల్‌తో కలిసి ఏడడుగులు వేసింది.
పెళ్లి తర్వాత సినిమాలు తగ్గిస్తేందనుకున్న హాన్సిక ఇప్పుడు వరుసగా మూవీస్ చేస్తుంది. అలాగే ఓటీటీలోనూ సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది.
ఇటీవల తన లేటెస్ట్ ఫిల్మ్ మై నేమ్ ఈజ్ శ్రుతి ప్రమోషన్లలో పాల్గొన్న హన్సిక తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌పై ఆసక్తికర కామెంట్లు చేసింది.
పెళ్లి తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదందీ యాపిల్ బ్యూటీ. కేవలం నా అడ్రస్ మాత్రమే మారిందని చెప్పుకొచ్చిందీ అందాల తార.
కాగా పెళ్లి తర్వాత తన ఇంటి పేరును మార్చుకోలేదని తెలిపింది హన్సిక. ఇందుకు కారణం కూడా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ
హన్సిక మోత్వానీ అనే గుర్తింపు కోసం చాలా కష్టపడ్డానని, అందుకే పెళ్లి తర్వాత కూడా ఇంటి పేరును మార్చుకోలేదంటూ తెలిపింది హన్సిక